Ritika Singh: రజనీకాంత్ కు జీవితాంతం రుణపడి ఉంటా: రితికా సింగ్

  • షూటింగ్ జరుపుకుంటున్న రజనీ తాజా చిత్రం 'వేటయ్యన్'
  • ఈ చిత్రంలో నటిస్తున్న రితికా సింగ్
  • గొప్ప వ్యక్తితో కలిసి పని చేస్తున్నానని సంతోషం
I am thankful to Rajinikanth says Ritika Singh

సూపర్ స్టార్ రజనీకాంత్ కు తాను జీవితాంతం రుణపడి ఉంటానని హీరోయిన్ రితికా సింగ్ అన్నారు. టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా 'వేటయ్యన్' చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాలో రితికా సింగ్ కు అవకాశం లభించింది. ఈ నేపథ్యంలో రజనీకి రితికా ధన్యవాదాలు తెలిపింది. రజనీకాంత్ లోని దయాగుణం, ప్రేమ సాటిలేనివని... అంతటి గొప్ప వ్యక్తితో తాను కలిసి పనిచేస్తున్నానని చెప్పింది. మరోవైపు ఈ చిత్రంలో ఇతర పాత్రల్లో అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్, తుషారా విజయన్ లు నటిస్తున్నారు. ఈ చిత్రం ఇప్పటికే తిరునల్వేలి, కన్నియాకుమారిల్లో షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 70 నుంచి 80 శాతం పూర్తయింది.

More Telugu News