Ponnam Prabhakar: కేసీఆర్ అలా చెప్పడం దారుణం: మంత్రి పొన్నం ప్రభాకర్

Minister Ponnam Prabhakar faults kcr comments on kaleswaram
  • మేడిగడ్డ బ్యారేజీలో కేవలం రెండు పిల్లర్లు మాత్రమే కుంగాయని చెప్పడం దారుణమని వ్యాఖ్య
  • కాంగ్రెస్ వస్తే కరవు వస్తుందని చెప్పడం సరికాదన్న మంత్రి పొన్నం ప్రభాకర్
  • రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ
మేడిగడ్డ బ్యారేజీలో కేవలం రెండు పిల్లర్లు మాత్రమే కుంగాయని మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పడం దారుణమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ... మొన్నటి వరకు అధికారంలో ఉన్నది బీఆర్ఎస్ పార్టీయేనని అలాంటప్పుడు కాంగ్రెస్ వస్తే కరవు వస్తుందని చెప్పడం సరికాదన్నారు. కేసీఆర్ ఏమాత్రం అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు.

తాము రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. బుద్ధి, జ్ఞానం ఉన్నోడు ఎవడూ... తమ వల్ల కరవు వచ్చిందని చెప్పడన్నారు. కాగా, ఇటీవల కరీంనగర్ సభలో కేసీఆర్ మాట్లాడుతూ... ప్రాజెక్టులో పిల్లర్ల కింద ఇసుక జారిపోతే బ్రహ్మాండం బద్దలైనట్లు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు.
Ponnam Prabhakar
Congress
Telangana

More Telugu News