HanuMan: రేప‌టి నుంచి జియో సినిమాలో 'హ‌నుమాన్' మూవీ

  • రేప‌టి నుంచే 'క‌ల‌ర్స్ సినీప్లెక్స్' టీవీ ఛానెల్‌లో కూడా టెలికాస్ట్
  • ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్ర‌క‌టించిన జియో సినిమా
  • 2024లో తొలి బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచిన హ‌నుమ‌న్‌
  • వ‌ర‌ల్డ్‌వైడ్‌గా ఏకంగా రూ.293.30 కోట్లు కొల్ల‌గొట్టిన మూవీ
HanuMan officially arriving on JioCinema on March 16

యువ న‌టుడు తేజా స‌జ్జా హీరోగా వ‌చ్చిన హ‌నుమాన్ మూవీ పాన్ ఇండియా హిట్‌ను అందుకున్న విష‌యం తెలిసిందే. విడుద‌లైన అన్నీ భాషల్లో ఈ మూవీ మంచి వ‌సూళ్లు రాబ‌ట్టి 2024లో తొలి బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచింది. ఇలా బాక్సాఫీస్ వ‌ద్ద ఘ‌న విజ‌యం అందుకున్న హ‌నుమాన్ ఇప్పుడు ఓటీటీ ప్రేక్ష‌కుల‌ను అల‌రించేందుకు రెడీ అయింది. ఇన్నాళ్లు ఈ మూవీ ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై, ఎప్పుడు విడుద‌ల‌వుతుంద‌నేది కొంత‌మేర గంద‌ర‌గోళానికి గురిచేసింది. చివ‌రికి 'జియో సినిమా'లో మార్చి 16న (శనివారం) హ‌నుమాన్ వ‌స్తోంది. అలాగే అదే రోజు 'క‌ల‌ర్స్ సినీప్లెక్స్' టీవీ ఛానెల్‌లో కూడా టెలికాస్ట్ కానుంది. ఈ మేర‌కు జియో సినిమా తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్ర‌క‌టించింది.  

బాక్సాఫీస్ వ‌ద్ద భారీ వ‌సూళ్లు

జ‌న‌వ‌రి 12న సంక్రాంతి కానుక‌గా విడుద‌లైన ఈ మూవీ తొలిరోజు కేవ‌లం 9.3కోట్లు మాత్ర‌మే రాబట్టింది. కానీ, వారం గ‌డిచేస‌రికి చాలా ఈజీగా రూ.100కోట్ల మార్క్‌ను దాటేసింది. ఇందులో అధిక వాటా రెండు తెలుగు రాష్ట్రాల‌దే. కేవ‌లం మౌత్‌టాక్‌తోనే జ‌నాలు ఈ మూవీకి బ్ర‌హ్మార‌థం ప‌ట్టారు. తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న హ‌నుమాన్ చాలా సుల‌వుగా రూ.200 కోట్ల వ‌సూళ్లు రాబ‌ట్టి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది. ఇక ఓవ‌ర్సీస్‌లోనూ ఈ సినిమా క‌న‌క‌వ‌ర్షం కురిపించింది. అక్క‌డ రూ.56.80 కోట్లు కొల్ల‌గొట్టింది. ఇలా వ‌ర‌ల్డ్‌వైడ్‌గా హ‌నుమాన్ ఏకంగా రూ.293.30 కోట్లు రాబ‌ట్టింది. 

యంగ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ వ‌ర్మ తెర‌కెక్కించిన ఈ సినిమాలో తేజా స‌జ్జాకు జోడిగా అమృత అయ్యర్ న‌టించింది. వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్, రాజ్ దీప‌క్ శెట్టి, విన‌య్ రాజ్, గేటాప్‌ శీను ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

More Telugu News