Ram Gopal Varma: నేను చెప్పింది ఒకటి.. మీరు అర్థం చేసుకున్నది మరొకటి.. సారీ చెప్పను: రామ్ గోపాల్ వర్మ

I am not contesting from Pithapuram says Ram Gopal Varma
  • ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న పవన్ కల్యాణ్
  • తాను కూడా పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నానని ప్రకటించిన వర్మ
  • ఎలెక్షన్ అనే పదాన్ని తాను వాడలేదని తాజాగా మరో ట్వీట్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్టు పవన్ ప్రకటించిన వెంటనే ఎక్స్ వేదికగా సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. పిఠాపురం నుంచి తాను పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు. 'సడన్ డెసిషన్. హ్యాపీ టు ఇన్ఫామ్. పిఠాపురం నుంచి నేను పోటీ చేస్తున్నా' అని ట్వీట్ చేశాడు. వర్మ చేసిన ట్వీట్ ఏపీలో సెన్షేషన్ క్రియేట్ చేసింది. 

అయితే, తాను పిఠాపురం నుంచి పోటీ చేయడం లేదని తాజాగా ఆయన మరో ట్వీట్ చేశారు. తన ట్వీట్ ను తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పారు. పిఠాపురంలో తాను తీసిన షార్ట్ ఫిలిమ్ లో కంటెస్ట్ గురించే తాను చెప్పానని వర్మ తెలిపారు. ఎలెక్షన్ అనే పదాన్నే తాను వాడలేదని... తన ట్వీట్ పై మీడియా ఊహాగానాలు చేసిందని చెప్పారు. ఈ మిస్ కమ్యూనికేషన్ కు తాను బాధ్యుడిని కాదు కాబట్టి... తాను సారీ చెప్పబోనని అన్నారు.
Ram Gopal Varma
Tollywood
Pawan Kalyan
Janasena
Pithapuram

More Telugu News