Odisha: భార్యను కడతేర్చి.. శవంతో రెండు రోజులు సహవాసం

Odisha man beats drunk wife to death and lives with her body for two days
  • ఒడిశాలో వెలుగు చూసిన దారుణం
  • మద్యం తాగొద్దని తిట్టినందుకు భార్య ప్రాణాలు తీసిన భర్త
  • ఇంట్లోని ఒక గదిలో శవాన్ని రెండు రోజులు దాచిన వైనం
  • ఊరి నుంచి వచ్చి శవాన్ని గుర్తించిన పెద్ద కొడుకు
ఒడిశాలో దారుణం వెలుగుచూసింది. ఓ 40 ఏళ్ల వ్యక్తి తన భార్యను హత్య చేసి ఇంట్లో శవంతో రెండు రోజులపాటు సహవాసం చేశాడు. మద్యం తాగొద్దని అసభ్యకరంగా తిట్టిందనే కారణంతో ఓ చెక్కతో ఆమెను కొట్టి చంపాడని స్థానిక పోలీసులు వెల్లడించారు. హత్య చేసిన తర్వాత మృతదేహాన్ని నిందితుడు ఇంట్లోని ఒక గదిలో దాచిపెట్టాడని, రెండు రోజులు అలాగే గడిచిపోయిందని, గురువారం ముగ్గురు పిల్లల్లో ఒకరు శవాన్ని గుర్తించడంతో విషయం వెలుగులోకి వచ్చిందని తెలిపారు. 

శవాన్ని ఒక గదిలో దాచిపెట్టి తాళం వేశాడని, అయితే దంపతుల 19 ఏళ్ల పెద్ద కొడుకు వారి స్వస్థలం గంజాం నుంచి ఇంటికి వచ్చి మృతదేహాన్ని గుర్తించాడని వివరించారు. సమాచారం అందడంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించామని, ఈ కేసులో తదుపరి దర్యాప్తు చేస్తామని పేర్కొన్నారు. రాష్ట్ర రాజధాని భువనేశ్వర్‌లోని మైత్రి విహార్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం ఈ ఘటన జరిగిందని వివరించారు. 

నిందితుడు గంజాంకు చెందిన వ్యక్తి అని, భార్య, ముగ్గురు కొడుకులతో అద్దెకు నివాసం ఉంటున్నారని పేర్కొన్నారు. మార్చి 12న ఈ హత్య జరిగిందని చెప్పారు. మద్యానికి బానిసైన నిందితుడు మంగళవారం మధ్యాహ్న సమయంలో మత్తులో ఇంటికి వెళ్లాడని, పద్ధతి మార్చుకోవాలంటూ అతడిని భార్య తిట్టిందని, అది నచ్చక ఆవేశంతో చెక్కతో కొట్టి చంపాడని పేర్కొన్నారు.
Odisha
Crime News

More Telugu News