KCR: ఆదిలాబాద్ బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ సమావేశం... లోక్ సభ అభ్యర్థి ఎంపికపై చర్చ

  • లోక్ సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, శ్రేణులను ఎన్నికలకు సిద్ధం చేయడంపై కేసీఆర్ దిశా నిర్దేశనం
  • ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు పేరును లోక్ సభకు పరిశీలిస్తున్న కేసీఆర్
  • గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆత్రం సక్కుకు టిక్కెట్ ఇవ్వని కేసీఆర్
  • లోక్ సభ టిక్కెట్ కేటాయిస్తామని అధిష్ఠానం హామీ
KCR meets Adilabala brs leaders

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బీఆర్ఎస్ నేతలతో ఆ పార్టీ అధినేత కేసీఆర్ గురువారం సమావేశమయ్యారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో ఆదిలాబాద్ లోక్ సభ అభ్యర్థి అంశంపై చర్చించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, అనిల్ జాదవ్, మాజీ మంత్రులు వేణుగోపాలచారి, జోగు రామన్న తదితరులు పాల్గొన్నారు. లోక్ సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, శ్రేణులను ఎన్నికలకు సిద్ధం చేయడంపై కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు. నేతలతో చర్చించి అభ్యర్థిని ఖరారు చేయనున్నారు.

గత లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన నగేష్ ఇటీవలే బీజేపీలో చేరారు. ఆయనకు బీజేపీ టిక్కెట్ కేటాయించింది. ఈ నేపథ్యంలో ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు పేరును కేసీఆర్ పరిశీలిస్తున్నారు. ఆయనకు గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ  చేసే అవకాశం ఇవ్వలేదు. లోక్ సభ టిక్కెట్ కేటాయిస్తామని అధిష్ఠానం హామీ ఇచ్చింది. ఈ క్రమంలో తనకు టిక్కెట్ రాదనే నగేశ్ పార్టీ వీడి బీజేపీలో చేరినట్లుగా తెలుస్తోంది.

More Telugu News