Venkatesh: హీరో వెంకటేశ్ ఇంట్లో పెళ్లి సందడి!

Actor Venkatesh daughter marriage
  • రేపు వెంకటేశ్ రెండో కూతురు పెళ్లి
  • విజయవాడకు చెందిన డాక్టర్ తో పెళ్లి
  • గత అక్టోబర్ లో జరిగిన ఎంగేజ్మెంట్
టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేశ్ ఇంట్లో పెళ్లి బాజాలు మోగనున్నాయి. వెంకటేశ్ రెండో కూతురు హయవాహిని పెళ్లి జరగబోతోంది. హైదరాబాద్ రామానాయుడు స్టూడియోస్ లో పెళ్లి వేడుక జరగనుంది. హయవాహిని ఎంగేజ్మెంట్ గత ఏడాది అక్టోబర్ లో చాలా సింపుల్ గా జరిగింది. ఆ వేడుకకు చిరంజీవి, మహేశ్ బాబు హాజరయ్యారు. ఇప్పుడు పెళ్లి కూడా ఎలాంటి హంగు, ఆర్భాటాలు లేకుండా చేయబోతున్నట్టు తెలుస్తోంది. రేపే హయవాహిని పెళ్లి జరగనుంది. విజయవాడకు చెందిన ఓ డాక్టర్ తో పెళ్లి జరగనుంది. ఈ పెళ్లికి కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరవుతున్నట్టు సమాచారం. పెళ్లి ఫొటోలు బయటకు వస్తేనే... పెళ్లికి ఎవరెవరు హాజరయ్యారనే విషయంలో క్లారిటీ వస్తుంది. వెంకటేశ్ కు ముగ్గురు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. పెద్దమ్మాయి అశ్రితకు 2019లో పెళ్లి జరిగింది.
Venkatesh
Tollywood
Daughter
Marriage

More Telugu News