Sreesanth: సినీ విలన్ గా టీమిండియా క్రికెటర్... వివరాలు ఇవిగో!

Cricketer Sreesanth portrays villain role in Yamadheera
  • శ్రీశాంత్ విలన్ గా యమధీర చిత్రం
  • కోమల్ కుమార్ హీరోగా చిత్రం
  • టీమిండియాలో ఫైర్ బ్రాండ్ పేసర్ గా గుర్తింపు తెచ్చుకున్న శ్రీశాంత్
టీమిండియా ఫైర్ బ్రాండ్ క్రికెటర్ గా ఎస్.శ్రీశాంత్ కు గుర్తింపు ఉంది. ప్రత్యర్థి జట్టులో ఎవరైనా మాటల యుద్ధానికి దిగితే, వారిపై పందెంకోడిలా దూకే శ్రీశాంత్ ఇప్పుడు సినీ రంగంలో దూసుకుపోతున్నాడు. కన్నడ చిత్రం యమధీరలో శ్రీశాంత్ విలన్ గా నటించాడు. ఇందులో కోమల్ కుమార్ హీరో. ఈ సినిమాలో రిషిక శర్మ, అలీ, నాగబాబు, సత్యప్రకాశ్ తదితరులు నటిస్తున్నారు. 

తాజాగా యమధీర నుంచి టీజర్ రిలీజైంది. శ్రీ మందిరం ప్రొడక్షన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని వేదాల శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి శంకర్.ఆర్ దర్శకుడు. 

కేరళ ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్ జాతీయ జట్టుకు ఎంపికైన తొలినాళ్లలో సిసలైన పేసర్ గా అందరి ప్రశంసలు అందుకున్నాడు. అయితే, దూకుడు స్వభావంతో అనేక పర్యాయాలు చిక్కుల్లో పడ్డాడు. ఆ తర్వాత ఐపీఎల్ లో మ్యాచ్ ఫిక్సింగ్ అంశం అతడి కెరీర్ పై మాయని మచ్చలా మిగిలిపోయింది. 

బీసీసీఐ అతడిపై నిషేధం ఎత్తివేయగా, కేరళ తరఫున దేశవాళీ క్రికెట్లో పాల్గొన్నాడు. క్రికెటర్ గా ఉన్నప్పటి నుంచీ శ్రీశాంత్ వినోద రంగంపై ఆసక్తి చూపుతుండేవాడు. స్వతహాగా డ్యాన్సర్ కావడంతో సినిమా ఈవెంట్లు టీవీ కార్యక్రమాల్లోనూ మెరిశాడు. 
Sreesanth
Yamadheera
Villain
Cricketer
Kannada

More Telugu News