Revanth Reddy: NTV అధినేత నరేంద్ర చౌదరి ఇంటికి వెళ్లిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy goes to NTV chief Narendra house
  • రేవంత్ రెడ్డిని లంచ్‌కు అహ్వానించిన నరేంద్ర చౌదరి
  • పుష్పగుచ్ఛం ఇచ్చి సాదరంగా ఆహ్వానించిన ఎన్టీవీ అధినేత
  • ముఖ్యమంత్రి వెంట మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం హైదరాబాదులోని ప్రముఖ తెలుగు న్యూస్ టీవీ ఛానల్ ఎన్టీవీ అధినేత నరేంద్ర చౌదరి నివాసానికి వెళ్లారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి కూడా వెళ్లారు. నరేంద్ర చౌదరి... సీఎంను లంచ్‌కి ఆహ్వానించారు. తన ఇంటికి వచ్చిన ముఖ్యమంత్రికి ఆయన పుష్పగుచ్ఛం ఇచ్చి సాదరంగా ఆహ్వానించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంతకుముందు బీజేపీ నేత, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి నివాసానికి వెళ్లి ఆయనను పార్టీలోకి ఆహ్వానించిన విషయం తెలిసిందే.
Revanth Reddy
ntv
Telangana
Congress

More Telugu News