Sri Lanka: శ్రీలంకలో 21 మంది భారతీయ యువకుల అరెస్ట్.. పర్యాటక వీసాపై వెళ్లి వీరంతా ఏం చేస్తున్నారో తెలుసా?

  • నిందితులందరూ 25 ఏళ్లలోపువారే
  • గత నెల శ్రీలంకలో కాలుమోపిన యువకులు
  • నెగోంబోలో అద్దె భవనం తీసుకుని కంప్యూటర్ ఆపరేటెడ్ బిజినెస్
  • గత నెలలో శ్రీలంకను సందర్శించిన 30 వేల మంది భారతీయులు
21 Indian nationals arrested in Sri Lanka for doing computer operated business

పర్యాటక వీసా నిబంధనలు ఉల్లంఘించి అక్రంగా కంప్యూటర్‌ సాయంతో వ్యాపారం చేస్తున్న 21 మంది భారతీయులను శ్రీలంక పోలీసులు నిర్బంధించారు. నిందితులందరూ 24 నుంచి 25 ఏళ్ల లోపువారే. ఇమ్మిగ్రేషన్ అధికారులు మంగళవారం వీరిని అరెస్ట్ చేశారు. ప్రాథమిక దర్యాప్తు అనంతరం పశ్చిమ తీర రిసార్ట్ పట్టణం నెగోంబోలోని ఓ అద్దె భవనంపై దాడి చేసిన అధికారులు వీరిని అదుపులోకి తీసుకున్నారు. ఆ ఇంట్లో వారు కంప్యూటర్ ఆపరేటెడ్ బిజినెస్ చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. అయితే, ఆ వ్యాపారం ఏంటన్న వివరాలను మాత్రం వెల్లడించలేదు. శ్రీలంక చట్టాల ప్రకారం పర్యాటక వీసాపై వచ్చినవారు ఎలాంటి వ్యాపారాలు చేయకూడదు. 

పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఈ నెల 31 వరకు వీసా లేకుండానే భారత సహా మరికొన్ని దేశాల పర్యాటకులను అనుమతిస్తోంది. పట్టుబడిన నిందితులు ఫిబ్రవరి, మార్చిలో టూరిస్ట్ వీసాలపై శ్రీలంకలో కాలుమోపారు. కాగా, రష్యా, ఉక్రెయిన్ టూరిస్టులు కూడా శ్రీలంకలో వ్యాపారాలు చేస్తున్నట్టు ఇమ్మిగ్రేషన్ అధికారులకు ఫిర్యాదులు వచ్చాయి. ఫిబ్రవరిలో 30 వేలమందికిపైగా భారతీయులు శ్రీలంకను సందర్శిస్తే.. 32 వేల మంది రష్యా పర్యాటకులు శ్రీలంకలో వాలిపోయారు.

More Telugu News