మెదక్ నుంచి రఘునందన్ రావు, మహబూబాబాద్ నుంచి సీతారాం నాయక్... 72 మందితో బీజేపీ రెండో జాబితా విడుదల
- మహబూబ్ నగర్ నుంచి డీకే అరుణ, నల్గొండ నుంచి సైదిరెడ్డి పోటీ
- పెద్దపల్లి నుంచి గోమాస శ్రీనివాస్, ఆదిలాబాద్ నుంచి నగేశ్ పేర్లు ప్రకటించిన అధిష్ఠానం
- రెండు జాబితాల్లో కలిపి 15 స్థానాలకు అభ్యర్థుల ఖరారు
ఆదిలాబాద్ నుంచి 2019లో బీజేపీ నుంచి సోయం బాపురావు విజయం సాధించారు. గత ఎన్నికల్లో బీజేపీ నుంచి తెలంగాణలో నలుగురు ఎంపీలుగా గెలిచారు. ఇందులో ముగ్గురికి మొదటి జాబితాలోనే టిక్కెట్ దక్కింది. రెండో జాబితాలో ఆదిలాబాద్ నుంచి మరొకరికి టిక్కెట్ ఇచ్చారు. ఈ రోజు విడుదల చేసిన 72 అభ్యర్థుల్లో దాద్రా నగర్ హవేలీ నుంచి 1, తెలంగాణ నుంచి 6, ఢిల్లీ నుంచి 2, గుజరాత్ నుంచి 7, హర్యానా నుంచి 6, హిమాచల్ ప్రదేశ్ నుంచి 2, కర్ణాటక నుంచి 20, మధ్యప్రదేశ్ నుంచి 5, మహారాష్ట్ర నుంచి 20, త్రిపుర నుంచి 1, ఉత్తరాఖండ్ నుంచి 2 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు.