Ganta Narahari: పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిన పారిశ్రామికవేత్త గంటా నరహరి

Tirupati industrialist Ganta Narahari joins Janasena
  • గంటా నరహరికి జనసేన కండువా కప్పిన పవన్ కల్యాణ్
  • జనసేన పార్టీలోకి సాదర స్వాగతం
  • 2022లో టీడీపీలో చేరిన గంటా నరహరి
తిరుపతికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త గంటా నరహరి నేడు జనసేన పార్టీలో చేరారు. ఇవాళ మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో గంటా నరహరి తన మద్దతుదారులతో కలిసి జనసేన తీర్థం పుచ్చుకున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. 

గంటా నరహరి గతంలో టీడీపీలో కొనసాగారు. 2022లో చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. దివంగత మాజీ ఎంపీ డీకే ఆదికేశవులు నాయుడుకు గంటా నరహరికి బంధుత్వం ఉంది. 

బెంగళూరు కేంద్రంగా వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న గంటా నరహరి 2017-18లో రాష్ట్రపతి చేతుల మీదుగా ఉత్తమ యువ పారిశ్రామికవేత్త పురస్కారం అందుకున్నారు. అయితే, ఈ ఎన్నికల్లో నరహరి తిరుపతి టికెట్ ఆశిస్తున్నట్టు ప్రచారంలో ఉంది.
Ganta Narahari
Janasena
Pawan Kalyan
Tirupati
Andhra Pradesh

More Telugu News