Meera Chopra Marriage: ఘనంగా కథానాయిక మీరా చోప్రా పెళ్లి వేడుక

Bangaaram movie Actor meera chopra ties knot in Rajasthan
  • రాజస్థాన్‌లోని ఓ రిసార్ట్‌లో వ్యాపారవేత్త రక్షిత్ కేజ్రీవాల్‌తో మీరా వివాహం
  • పెళ్లి ఫొటోలను ఇన్‌స్టాలో పంచుకున్న నటి, వెల్లువెత్తిన అభినందనలు
  • ప్రముఖ నటి ప్రియాంక చోప్రాకు స్వయంగా బంధువైన మీరా చోప్రా
తెలుగు ప్రేక్షకులకు చిరపరిచితమైన సినీ నటి మీరా చోప్రా వైవాహిక బంధంలో కాలుపెట్టారు. రాజస్థాన్‌లోని ఓ రిసార్టులో మంగళవారం ఆమె.. వ్యాపారవేత్త రక్షిత్ కేజ్రీవాల్‌ను వివాహమాడారు. జైపూర్‌లోని ఓ రిసార్ట్‌లో ఈ వేడుక జరిగింది. పెళ్లి ఫోటోలను మీరా చోప్రా ఇన్‌స్టాలో షేర్ చేయడంతో అభిమానులు, సినీ ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. 

కొంతకాలంగా ఈ జంట ప్రేమలో ఉంది. కొన్ని నెలల క్రితమే మీరా చోప్రా తన ప్రేమ విషయాన్ని ఓ ఇంటర్వ్యూ సందర్భంగా బయటపెట్టింది. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్టు చెప్పింది కానీ వరుడు ఎవరనేది మాత్రం వెల్లడించలేదు. తాము సంప్రదాయక హిందూ పద్ధతిలో పెళ్లి చేసుకోబోతున్నట్టు ఆమె పేర్కొంది. ప్రముఖ నటి ప్రియాంక చోప్రాకు బంధువైన మీరా ఆమెను తన పెళ్లికి కచ్చితంగా ఆహ్వానిస్తానని కూడా పేర్కొంది. ‘వాళ్లు ఫ్రీగా ఉంటే వస్తారు’ అంటూ యాంకర్ అడిగిన మరో ప్రశ్నకు బదులిచ్చింది. మీరా చోప్రా తండ్రి సురేశ్ చోప్రా, ప్రియాంక చోప్రా తండ్రికి కజిన్ అవుతారు. 

పవన్ కల్యాణ్ సరసన ‘బంగారం’ సినిమాలో హీరోయిన్‌గా మీరా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ‘వాన’, ‘మారో’, ‘గ్రీకు వీరుడు’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది. తమిళ సినిమాల్లోనూ మెరిసింది. మోడలింగ్‌తో తన కెరీర్ ప్రారంభించిన మీరా ఆ తరువాత దక్షిణాది నుంచి బాలీవుడ్‌ వైపు మళ్లింది. చివరిసారిగా ఆమె జీ5 ఫిలిమ్స్‌కు చెందిన సఫేద్ చిత్రంలో కనిపించింది.
Meera Chopra Marriage
Rajasthan
Tollywood
Bollywood
Viral Pics

More Telugu News