Revanth Reddy: రేపు ఢిల్లీకి వెళ్లనున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy will go Delhi tomorrow
  • రేపు సాయంత్రం జరిగే సీఈసీ భేటీలో పాల్గొననున్న రేవంత్ రెడ్డి
  • ఐదుగురు అభ్యర్థులను ప్రకటించిన పార్టీ
  • మిగిలిన అభ్యర్థుల పేర్లపై చర్చించనున్న అధిష్ఠానం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. బుధవారం సాయంత్రం ఢిల్లీలో జరగనున్న పార్టీ సీఈసీ సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. తెలంగాణలోని 17 లోక్ సభ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు నలుగురు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఓ అభ్యర్థి పేరును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. మొత్తం ఐదుగురు అభ్యర్థులు ఖరారయ్యారు. మిగతా స్థానాల్లో అభ్యర్థులపై రేపు చర్చించనున్నారు. రేవంత్ రెడ్డితో పాటు ఒకరిద్దరు మంత్రులు కూడా వెళ్లే అవకాశముంది. జహీరాబాద్ నుంచి సురేష్ షేట్కార్ , చేవెళ్ల నుంచి సునీతా మహేందర్ రెడ్డి, నల్గొండ నుంచి కుందూరు రఘువీర్, మహబూబా బాద్ నుంచి బలరాం నాయక్ పేర్లను ప్రకటించింది. మహబూబ్ నగర్ నుంచి వంశీచంద్ రెడ్డి పేరును సీఎం ప్రకటించారు.
Revanth Reddy
Telangana
Congress

More Telugu News