Sarath Kumar: తన పార్టీని బీజేపీలో కలిపేసిన శరత్ కుమార్

  • 2007లో ఏఐఎస్ఎంకే పార్టీని స్థాపించిన శరత్ కుమార్
  • 2011లో రెండు ఎమ్మెల్యే సీట్లు గెలుచుకున్న ఏఐఎస్ఎంకే
  • చాలా కాలం పాటు అన్నాడీఎంకేతో కలిసి పనిచేసిన ఏఐఎస్ఎంకే
Sarath Kumar led AISMK merges with BJP

తమిళ సినీ నటుడు శరత్ కుమార్ తన ఆలిండియా సమతువ మక్కల్ కట్చి (ఏఐఎస్ఎంకే) పార్టీని బీజేపీలో విలీనం చేశారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఈ కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్లమెంట్ ఎన్నికల్లో శరత్ కుమార్ పోటీ చేసే అవకాశం ఉంది. శరత్ కుమార్ 2007లో ఏఐఎస్ఎంకే పార్టీని స్థాపించారు. చాలా కాలం పాటు అన్నాడీఎంకే పార్టీతో కలిసి శరత్ కుమార్ నడిచారు. 2011 అసెంబ్లీ ఎన్నికల్లో శరత్ కుమార్ పార్టీ రెండు సీట్లు గెలుచుకుంది. 

మరోవైపు బీజేపీతో పొత్తు పెట్టుకోబోతున్నామని అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం (ఏఎంఎంకే) ప్రకటించింది. ఎలాంటి షరతులు లేకుండానే బీజేపీతో పొత్తుకు సిద్ధమని  ఏఎంఎంకే జనరల్ సెక్రటరీ టీటీవీ దినకరన్ తెలిపారు. దక్షిణాదిన పట్టు పెంచుకోవాలని ప్రయత్నిస్తున్న బీజేపీకి ఈ పరిణామాలన్నీ బలం పెంచేవే అని చెప్పుకోవచ్చు. 

More Telugu News