Amit Shah: పాతబస్తీ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న అమిత్ షా, మాధవీలత

Amit Shah and Madhavi Latha offer prayers at Bhagyalaxmi temple
  • ఆలయంలో అమిత్ షా ప్రత్యేక పూజలు
  • అమిత్ షా పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు
  • వేదమంత్రాలతో ఆహ్వానం పలికిన ఆలయ పూజారులు
కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా, హైదరాబాద్ లోక్ సభ బీజేపీ అభ్యర్థి కొంపెల్ల మాధవీలత మంగళవారం పాతబస్తీలోని భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయంలో అమిత్ షా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమిత్ షా పర్యటన నేపథ్యంలో చార్మినార్ పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. అమిత్ షా, మాధవీలతలకు ఆలయ పూజారులు వేదమంత్రాలతో ఆహ్వానం పలికారు. అమిత్ షా అంతకుముందు బీజేపీ సోషల్ మీడియా వారియర్స్ సమావేశంలో, ఆ తర్వాత ఎల్బీ స్టేడియంలో బీజేపీ బహిరంగ సభలో పాల్గొన్నారు.
Amit Shah
Telangana
bhagyalaxmi temple
Hyderabad
BJP

More Telugu News