Geetanjali: గీతాంజలి కుటుంబానికి రూ.20 లక్షల పరిహారం ప్రకటించిన సీఎం జగన్

CM Jagan announces Rs 20 lakhs exgratia for Geetanjali family
  • ఇటీవల ఆత్మహత్య చేసుకున్న తెనాలి యువతి గీతాంజలి
  • విపక్షాల ట్రోలింగ్ వల్లే ఆమె బలవన్మరణం చెందిందని వైసీపీ ఆరోపణలు
  • గీతాంజలి మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం జగన్
తెనాలి యువతి గీతాంజలి విపక్షాల ట్రోలింగ్ కారణంగానే బలవన్మరణం చెందిందంటూ అధికార వైసీపీ తీవ్ర ఆరోపణలు చేస్తుండడం తెలిసిందే. తాజాగా, ఈ ఘటనపై సీఎం జగన్ స్పందించారు. గీతాంజలి ఆత్మహత్య తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని అన్నారు. గీతాంజలి కుటుంబాన్ని ఆదుకోవాలని, అందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గీతాంజలి కుటుంబానికి రూ.20 లక్షల పరిహారం ఇవ్వాలని స్పష్టం చేశారు. ఆడపిల్లల గౌరవ ప్రతిష్ఠలకు, మర్యాదలకు భంగం కలిగించే ఏ ఒక్కరినీ కూడా చట్టం వదిలిపెట్టదని సీఎం జగన్ హెచ్చరించారు.
Geetanjali
Suicide
Jagan
Exgratia
YSRCP
TDP
Janasena

More Telugu News