Ram Gopal Varma: గ్రీన్ మ్యాట్, గ్రాఫిక్స్ అంటూ లోకేశ్ చేసిన ట్వీట్ పై వర్మ స్పందన

Ram Gopal Varma counters Nara Lokesh allegations on Medarametla Siddham meeting
  • నిన్న మేదరమెట్ల వద్ద సిద్ధం సభ
  • జనాలే లేరంటూ టీడీపీ విమర్శలు
  • గ్రీన్ మ్యాట్ వేసి గ్రాఫిక్స్ తో జనాలు వచ్చినట్టు చూపించారన్న లోకేశ్
  • నీ అజ్ఞానానికి హద్దుల్లేవంటూ వర్మ ట్వీట్  
బాపట్ల జిల్లా మేదరమెట్ల వద్ద నిన్న సీఎం జగన్ హాజరైన సిద్ధం సభలో జనాలు లేకపోయినా, గ్రీన్ మ్యాట్ వేసి గ్రాఫిక్స్ సాయంతో భారీగా జనాలు హాజరైనట్టు చూపించారని నారా లోకేశ్, తదితర టీడీపీ నేతలు వైసీపీపై తీవ్ర విమర్శలు చేస్తుండడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేసిన ట్వీట్  ను పంచుకున్నారు. "నీ అజ్ఞానానికి హద్దుల్లేవు. నీకు సినీ పరిశ్రమలో చాలామంది మిత్రులు ఉన్నారు కదా... లైవ్ స్ట్రీమింగ్ జరుగుతున్న ఈవెంట్ లో గ్రాఫిక్స్ చేయడం సాధ్యమయ్యే పనేనా అని వారిని అడగకపోయావా?" అంటూ వర్మ ట్వీట్ చేశారు.
Ram Gopal Varma
Nara Lokesh
Siddham
Medarametla
YSRCP
TDP

More Telugu News