Devineni Uma: రైతుల బాధలు చూడనట్టు సీఎం మొద్దు నిద్రపోతున్నాడు: దేవినేని ఉమా

  • రాష్ట్రంలో కరవు తాండవిస్తోందన్న దేవినేని ఉమా
  • జగన్ అసమర్థ పాలనతో రాష్ట్రం కరవు కోరల్లో చిక్కుకుందని వెల్లడి
  • రైతుల జీవితాలు కకావికలం అవుతున్నాయని ఆవేదన 
Devineni Uma fires on CM Jagan

రాష్ట్రంలో కరవు తాండవిస్తుంటే సీఎం జగన్ మొద్దు నిద్రపోతున్నాడంటూ టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా మండిపడ్డారు. జగన్ రెడ్డి అసమర్థ పాలనతో రాష్ట్రం కరవు కోరల్లో చిక్కి విలవిల్లాడుతోందని తెలిపారు. రైతుల బాధలను ఈ ముఖ్యమంత్రి ఏమాత్రం పట్టించుకోవడంలేదని విమర్శించారు. 

ఓవైపు ప్రకృతి వైపరీత్యం, మరోవైపు ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతుల జీవితాలు కకావికలం అవుతున్నాయని దేవినేని ఉమా ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ర్టంలో వందేళ్లలో ఎన్నడూ లేనంతగా పంట సాగు తగ్గిపోయిందని తెలిపారు. 45 లక్షల ఎకరాలు బీడు భూములుగా మారాయని, 43 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని వివరించారు. 

రాష్ట్రంలో రైతు, రైతు కూలీల నేటి దుస్థితికి కారణం మీరు కాదా జగన్? అని దేవినేని ఉమా సూటిగా ప్రశ్నించారు.

More Telugu News