Revanth Reddy: ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy greeting on the occation of ramadan
  • నెలవంక దర్శనం ఇవ్వడంతో పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం
  • రంజనా మాసంలో ముస్లింలు కఠోర ఉపవాస దీక్షలు, ప్రార్థనలు, క్రమశిక్షణ పాటిస్తారని పేర్కొన్న సీఎం
  • రంజాన్ మాసం ఆదర్శవంతమైన జీవనానికి ప్రేరణ ఇస్తోందని వెల్లడి
ముస్లిం సోదరులకు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ రోజు నెలవంక దర్శనం ఇవ్వడంతో పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మాసంలో ముస్లింలు కఠోర ఉపవాస దీక్షలు, ప్రార్థనలు, క్రమశిక్షణ పాటిస్తారని పేర్కొన్నారు. రంజాన్ మాసం ఆదర్శవంతమైన జీవనానికి ప్రేరణ ఇస్తోందన్నారు. ముస్లిం సోదరులు రంజాన్ మాసాన్ని ఆనందంతో.. సుఖసంతోషాలతో నిర్వహించుకోవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.
Revanth Reddy
Congress
Telangana

More Telugu News