Lok Sabha Polls: నల్గొండ లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని ముఖ్య నేతలతో కేసీఆర్ సమావేశం

KCR meets with nalgonda Lok sabha leaers
  • నందినగర్‌లో గల కేసీఆర్ నివాసంలో జరిగిన సమావేశం 
  • ఎన్నికల కార్యాచరణ, పార్టీ లోక్ సభ అభ్యర్థి అంశంపై చర్చ
  • భేటీకి హాజరైన ఎమ్మెల్యేలు జగదీశ్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి
నల్గొండ లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని ముఖ్య నేతలతో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారు. ఎన్నికల కార్యాచరణ, పార్టీ లోక్ సభ అభ్యర్థి అంశంపై చర్చించారు. బంజారాహిల్స్‌లోని నందినగర్‌లో గల కేసీఆర్ నివాసంలో సమావేశం జరిగింది. ఈ భేటీకి మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జ‌గ‌దీశ్ రెడ్డి, జ‌న‌గాం ఎమ్మెల్యే ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గొంగిడి సునీత‌, ర‌వీంద్ర నాయ‌క్, గ్యాద‌రి కిశోర్, కూసుకుంట్ల ప్ర‌భాక‌ర్ రెడ్డి, బొల్లం మ‌ల్ల‌య్య యాద‌వ్, చిరుమ‌ర్తి లింగ‌య్య‌, సీనియర్ నేత చెరుకు సుధాకర్ సహా పలువురు పాల్గొన్నారు.
Lok Sabha Polls
KCR
BRS

More Telugu News