Allu Arjun: హద్దులు మీరిన అభిమానం.. ‘జై అల్లు అర్జున్’ అనమంటూ యువకుడిని చితకబాదిన ఫ్యాన్స్.. వీడియో ఇదిగో!

Tollywood Hero Allu Arjun Fans Attacked For Not Saying Jai Allu Arjun In Bengaluru
  • కన్నడ రాజధాని బెంగళూరులో ఘటన
  • అందరూ కలిసి ఒక్కడిపై దాడి
  • రక్తం వచ్చేలా పిడిగుద్దులు
  • పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్
మా హీరో గొప్ప అంటే.. మా హీరో గొప్ప అంటూ సినీ నటుల ఫ్యాన్స్ సోషల్ మీడియాకెక్కి రచ్చచేసుకున్న ఘటనలు ఇటీవల చాలానే చూశాం. కొన్నిసార్లు రోడ్డెక్కి తన్నుకున్న ఘటనలు కూడా చూశాం. కానీ, ఇది మరీ విచిత్రం. ఫ్యాన్ పిచ్చికి పరాకాష్ఠగా నిలిచిన ఈ ఘటన బెంగళూరులో జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. 

ఓ మైదానంలో కొందరు యువకులు ఓ యువకుడిని చుట్టుముట్టి చొక్కా పట్టుకుని లాగుతూ పిడిగుద్దులు కురిపించారు. ఓ యువకుడి చేతిలో క్రికెట్ బ్యాట్ కూడా ఉంది. దీనినిబట్టి క్రికెట్ ఆడుతుండగా ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. దాదాపు 10 మంది యువకులు బాధితుడు ఒక్కడిని పట్టుకుని బలంగా పిడిగుద్దులు కురిపించారు. వారి చేతుల్లో చిక్కిన అతడికి తప్పించుకునే మార్గం లేకుండా పోయింది. అతడి చొక్కాపై రక్తపు మరకలు కూడా కనిపించాయి.

నిందితుల మాటలను బట్టి దెబ్బలు తింటున్న యువకుడు ‘జై అల్లు అర్జున్’ అనకపోవడమే ఈ గొడవకు కారణమని తెలుస్తోంది. వారు అతడిని చితకబాదుతూ అల్లు అర్జున్, అల్లు అర్జున్ అనడం స్పష్టంగా వినిపించింది. వీడియో కాస్తా వైరల్ కావడంతో ఓ వ్యక్తి దీనిని ఎక్స్‌లో షేర్ చేస్తూ వీరిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బెంగళూరు పోలీసులను ట్యాగ్ చేశాడు.
Allu Arjun
Bengaluru
Karnataka
Viral Videos

More Telugu News