Abhinay: తిరుమలలో మూడేళ్ల చిన్నారి కిడ్నాప్

  • తిరుమల వచ్చిన బాలుడు అభినయ్ కుటుంబం
  • యాత్రికుల సముదాయం-2 వద్ద బాలుడి అపహరణ
  • ఓ మహిళ బాలుడ్ని ఎత్తుకెళ్లినట్టు సీసీటీవీ ఫుటేజిలో వెల్లడి
Boy kidnapped in Tirumala

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో మూడేళ్ల చిన్నారి కిడ్నాప్ కు గురైన సంఘటన కలకలం రేపుతోంది. తెలంగాణలోని గద్వాల్ జిల్లాకు చెందిన అభినయ్ అనే మూడేళ్ల చిన్నారిని ఓ మహిళ అపహరించినట్టు సీసీటీవీ ఫుటేజి ద్వారా వెల్లడైంది. 

మొక్కులు తీర్చుకునేందుకు బాలుడు అభినయ్ కుటుంబం తిరుమల రాగా, యాత్రికుల సముదాయం-2 వద్ద అభినయ్ కిడ్నాప్ నకు గురైనట్టు గుర్తించారు. దాంతో తీవ్ర ఆందోళనకు గురైన బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అందుబాటులో ఉన్న సీసీటీవీ ఫుటేజి ద్వారా దర్యాప్తు ప్రారంభించారు. అభినయ్ ని ఎత్తుకెళ్లింది ఓ మహిళ అని సీసీటీవీ ఫుటేజిలో తేలడంతో, ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.

More Telugu News