Pawan Kalyan: బీజేపీ నేతలతో పవన్ కల్యాణ్ కీలక సమావేశం

Pawan Kalyan crucial meeting with BJP leaders
  • విజయవాడలో సమావేశం
  • బీజేపీ తరఫున కేంద్రమంత్రి షెకావత్,  బైజయంత్ పండా హాజరు
  • పోటీ చేసే స్థానాలపై పవన్ తో చర్చలు
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నేడు బీజేపీ నేతలతో సమావేశమయ్యారు. ఏపీలో జనసేన-టీడీపీ-బీజేపీ మధ్య పొత్తు కుదిరిన నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. విజయవాడలో జరిగిన ఈ సమావేశానికి బీజేపీ నుంచి కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు బైజయంత్ పండా హాజరయ్యారు. 

పొత్తు కుదిరిన నేపథ్యంలో, పోటీ చేసే స్థానాలపై పవన్, షెకావత్, పురందేశ్వరి చర్చలు జరిపారు. లోక్ సభ, అసెంబ్లీ అభ్యర్థుల ఎంపికపై ఇరుపార్టీల నేతలు సమాలోచనలు చేశారు. ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్ సభ స్థానాలు ఉండగా... బీజేపీ-జనసేనకు 30 అసెంబ్లీ స్థానాలు, 8 ఎంపీ స్థానాలు కేటాయించిన సంగతి తెలిసిందే.
Pawan Kalyan
Janasena
BJP
Alliance
TDP
Vijayawada
Andhra Pradesh

More Telugu News