తాబేలు మాంసం తిని 9 మంది మృత్యువాత

Nine dead after eating Turtle meat
  • జాంజిబార్ దీవుల్లో విషాదం
  • సముద్ర తాబేలు మాంసాన్ని తిన్న వారికి తీవ్ర అస్వస్థత
  • మరణించిన వారిలో ఒక మహిళ, ఎనిమిది మంది చిన్నారులు
  • చికిత్స పొందుతున్న 78 మంది
ఆఫ్రికా దేశం టాంజానియా సమీపంలోని జాంజిబార్ దీవుల్లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. సముద్ర తాబేలు మాంసం తిని 9 మంది మృత్యువాత పడ్డారు. మరో 78 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరణించిన వారిలో ఒక మహిళ, 8 మంది చిన్నారులు ఉన్నారు. తాబేలు మాంసం తిన్నందువల్లే వారంతా ప్రాణాలు కోల్పోయినట్టు ల్యాబ్ టెస్టుల్లో నిర్ధారణ అయింది. జాంజిబార్ ప్రజలకు తాబేలు ఎంతో ఇష్టమైన ఆహారం. 

2021లోనూ ఇక్కడ తాబేలు మాంసం తిని ఏడుగురు కన్నుమూశారు. తాజాగా, మరోసారి అలాంటి ఘటన జరిగిన నేపథ్యంలో, సముద్ర తాబేలు మాంసం తినవద్దంటూ ప్రజలకు అధికారులు సూచన చేశారు.
Go Back to Shorts
Zanzibar
Turtle Meat
Dead
Africa

More Telugu News