Saranya ** Scene: నగ్నంగా నటించేందుకు నా భర్త మద్దతు కూడా ఉంది: శరణ్య
- అలా నటించినందుకు ఇబ్బంది కలగలేదన్న నటి
- కొందరి విమర్శలే బాధించాయని వెల్లడి
- అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ లో శరణ్య న్యూడ్ సీన్
ఫిదా సినిమాలో హీరోయిన్ అక్కగా నటించి మంచి మార్కులు కొట్టేసిన శరణ్య.. తాజాగా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాతో హీరోయిన్ గా మారారు. ఈ సినిమాలోనూ తన నటనతో ఆకట్టుకున్న శరణ్య.. ఇటీవల ఓ ఇంటర్య్యూలో బాంబు పేల్చారు. తాను ఈ సినిమాలో నగ్నంగా నటించానని శరణ్య చెప్పడం సంచలనంగా మారింది. కథాపరంగా వచ్చే సీన్ కావడంతో అలా నటించాల్సి వచ్చిందని వివరణ ఇచ్చింది. అయితే, న్యూడ్ గా నటించడం పెద్దగా ఇబ్బంది కలిగించలేదని, తన భర్తతో పాటు డైరెక్టర్ ప్రోత్సాహంతో సీన్ బాగా వచ్చిందని చెప్పింది. నగ్నంగా నటించడం కన్నా దానిపై వచ్చిన విమర్శలే తనను బాధించాయని మరో ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
‘ఈ చిత్రంలో న్యూడ్‌గా నటించినందుకు నాకు ఎలాంటి ఇబ్బంది కలగ లేదు. నా భర్త ప్రోత్సాహం, డైరెక్టర్ సహకారంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా సీన్ కంప్లీట్ చేశా. కానీ ఈ సీన్ పై వస్తున్న విమర్శలు బాధిస్తున్నాయి. ఇంకేదో ఆశించి ఇలా న్యూడ్‌గా నటించానని చర్చించుకోవడం, పలు వెబ్ సైట్లు దీనిపై దారుణంగా రాయడం వల్ల బాధ కలుగుతోంది. అలాంటి వారు చూసే విధానాన్ని మార్చుకోవాలి’ అంటూ శరణ్య కామెంట్ చేసింది.