Congress: తమిళనాడులో కుదిరిన డీల్... పుదుచ్చేరి సహా 10 స్థానాల్లో పోటీ చేయనున్న కాంగ్రెస్

Congress to contest 9 Lok Sabha seats in Tamil Nadu

  • 40 లోక్ సభ స్థానాలకు గాను 21 సీట్లలో డీఎంకే, 10 చోట్ల కాంగ్రెస్ పోటీ
  • 9 స్థానాల్లో పోటీ చేయనున్న ఇతర మిత్ర పక్షాలు
  • మిగతా స్థానాల్లో మిత్ర పక్షాలకు మద్దతిస్తామన్న కేసీ వేణుగోపాల్

రాబోయే లోక్ సభ ఎన్నికల కోసం తమిళనాడులో డీఎంకే-కాంగ్రెస్ కూటమి మధ్య సీట్ల పంపకం కుదిరింది. తమిళనాడులో 39, పుదుచ్చేరిలో ఒక సీటు... మొత్తం 40 స్థానాలకు గాను డీఎంకే 21 సీట్లలో, కాంగ్రెస్ 10 సీట్లలో, సీపీఎం 2, సీపీఐ 2, ఎండీఎంకే 1, వీసీకే 2, ఐయూఎంఎల్ 1, కేఎండీకే 1 స్థానంలో పోటీ చేయనున్నాయి. పుదుచ్చేరి స్థానాన్ని కాంగ్రెస్ పార్టీకి కేటాయించారు.

డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్, టీఎన్‌సీసీ చీఫ్ కే సెల్వపెరుంతగై, ఏఐసీసీ నేతలు కేసీ వేణుగోపాల్, అజయ్ కుమార్‌లు సమావేశమై సీట్ల పంపకాలను నిర్ణయించారు.

కేసీ వేణుగోపాల్ మీడియాతో మాట్లాడుతూ... తమిళనాడు, పుదుచ్చేరిలో డీఎంకేతో జట్టు కట్టడం సంతోషంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ తమిళనాడులో 9 స్థానాలతో పాటు పుదుచ్చేరిలో కూడా పోటీ చేయనుందన్నారు. మిగిలిన స్థానాల్లో డీఎంకే, కూటమి పార్టీల అభ్యర్థులకు మద్దతిస్తామన్నారు. తమిళనాడులోని మొత్తం 40 స్థానాల్లో తమ కూటమి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

More Telugu News