Chandrababu: ప్రభుత్వాన్ని చూసి ప్రజలు భయపడడం ఏంటి?: చంద్రబాబు

Chandrababu said people fears of state govt
  • ఏపీలో మూడు పార్టీల రాజకీయ కూటమి ఏర్పాటు
  • ఈ నెలలోనే ప్రచారం ప్రారంభిస్తామన్న చంద్రబాబు
  • ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత కంటే భయం ఎక్కువగా ఉందని వెల్లడి  
ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ రాజకీయ కూటమి ఏర్పడింది. గత కొంతకాలంగా ప్రతిపాదనల దశలో ఉన్న మూడు పార్టీల పొత్తు నేడు ఖరారైంది. ఈ నేపథ్యంలో, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు స్పందించారు. 

మరి కొన్నిరోజుల్లో ఎన్నికల షెడ్యూల్ రానున్నందున, మూడు పార్టీలు కలిసి ఈ నెలలోనే ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తాయని వెల్లడించారు. ఏ పార్టీ ఏ స్థానంలో పోటీ చేస్తుందో రెండ్రోజుల్లో వెల్లడిస్తామని తెలిపారు. 

ఈ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత కంటే భయం ఎక్కువగా ఉందని అన్నారు. ప్రభుత్వాన్ని చూసి ప్రజలు భయపడడం ఏంటి? అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రాష్ట్రాభివృద్ధిని కోరుకునే మైనారిటీ సోదరులు తమకే ఓటేస్తారని ధీమా వ్యక్తం చేశారు. 

కొన్ని నెలల కిందట తనను అరెస్ట్ చేసినప్పుడు భౌతికంగా లేకుండా చేయాలని చూశారని చంద్రబాబు ఆరోపించారు. జగన్ వంటి రాజకీయనేతను ప్రపంచంలో ఎక్కడా చూసి ఉండరని వ్యాఖ్యానించారు.
Chandrababu
TDP
Janasena
BJP
Alliance
Andhra Pradesh

More Telugu News