Razakar: రజాకార్ విడుదల ఆపాలంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్

  • ఈ నెల 15న విడుదల కానున్న 'రజాకార్' చిత్రం
  • 6 భాషల్లో విడుదలవుతున్న సినిమా
  • విడుదలను ఆపేయాలని కోరుతూ ఏపీసీఆర్ పిటిషన్
Petition filed in TS High Court against Razakar movie

నిజాం పాలన సమయంలో, దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా తెలంగాణలో హిందూ జనాభాపై రజాకార్లు చేసిన అకృత్యాలు అంతాఇంతా కాదు. రజాకార్ల ఆగడాలు, తెలంగాణ బిడ్డల బాధలు, త్యాగాలు, ఈ గడ్డ కోసం పోరాడిన వాళ్ల చరిత్ర ఆధారంగా 'రజాకార్: ది సైలెంట్ జెనోసైడ్ ఆఫ్ హైదరాబాద్' చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో బాబీ సింహా, వేదిక, అనుష్య త్రిపాఠి, ప్రేమ, ఇంద్రజ, అనసూయ మకరంద్ దేశ్ పాండే తదితరులు నటించారు. యాటా సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని గూడురు నారాయణరెడ్డి నిర్మించారు. ఈ నెల 15న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, మరాఠీ భాషల్లో విడుదల కాబోతోంది. 

మరోవైపు ఈ చిత్రం విడుదలను నిలిపివేయాలంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలయింది. అసోసియేషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ (ఏపీసీఆర్) ఈ పిటిషన్ వేసింది. ఈ నెల 11న ఈ పిటిషన్ పై విచారణ జరగనుంది. ఈ సందర్భంగా ఏపీసీఆర్ కార్యదర్శి నదీమ్ ఖాన్ మాట్లాడుతూ... పౌర హక్కులను పరిరక్షించడానికి, మత సామరస్యాన్ని ప్రోత్సహించడానికే తాము పిటిషన్ వేశామని చెప్పారు. మరోవైపు దర్శక నిర్మాతలు మాట్లాడుతూ, రజాకార్ల అరాచకాలు, ఈ గడ్డ కోసం పోరాడిన వారి చరిత్ర చెప్పడానికే ఈ సినిమా తీశామని తెలిపారు. 

More Telugu News