Blasphemy: వాట్సాప్‌లో దైవదూషణ.. 22 ఏళ్ల పాక్ విద్యార్థికి మరణ శిక్ష

  • ముస్లింల మనోభావాలు దెబ్బతినేలా వీడియోలు సిద్ధం చేసిన పాక్ యువకుడు
  • వీటిని వాట్సాప్‌లో షేర్ చేసిన మరో టీనేజర్
  • యువకుడికి మరణ శిక్ష విధించిన కోర్టు, టీనేజర్‌కు యావజ్జీవ కారాగార శిక్ష
Pakistan student sentenced to death over blasphemous WhatsApp messages

దైవదూషణకు పాల్పడ్డాడంటూ ఓ పాక్ విద్యార్థికి (22) స్థానిక న్యాయస్థానం మరణ శిక్ష విధించింది. ఇదే కేసులో మరో టీనేజర్‌కు యావజ్జీవ కారాగార శిక్ష పడింది. వాట్సాప్‌ మెసేజీల్లో వారు దైవదూషణకు పాల్పడ్డట్టు కోర్టు తన తీర్పులో పేర్కొంది. 

మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలతో కూడిన ఫొటోలు వీడియోలను పాక్ విద్యార్థి సిద్ధం చేశాడు. వీటిని ఓ టీనేజర్ వాట్సాప్‌లో షేర్ చేశాడు. ఓ వ్యక్తి ఫిర్యాదు ఆధారంగా యువకులిద్దరిపై పాక్ కేంద్ర దర్యాప్తు సంస్థకు చెందిన సైబర్ నేరాల విభాగం 2022లో కేసు నమోదు చేసింది. తనకు మూడు మొబైల్ ఫోన్ నెంబర్ల నుంచి ఈ సందేశాలు వచ్చాయని ఫిర్యాదుదారు పేర్కొన్నారు. కేసుపై విచారణ చేపట్టిన స్థానిక న్యాయస్థానం.. యువకుల చర్యలు ముస్లింల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని కోర్టు పేర్కొంది. 

అయితే, ఈ తీర్పుపై హైకోర్టులో అప్పీలు చేస్తానని మరణశిక్ష పడ్డ యువకుడి తండ్రి మీడియాతో తెలిపారు. పాక్‌లో దైవదూషణకు పాల్పడేవారికి మరణశిక్ష విధిస్తారు. దైవదూషణకు సంబంధించి చట్టాలను తొలుత బ్రిటీష్ పాలకులు రూపొందించగా 1980ల్లో అప్పటి పాక్ సైనిక ప్రభుత్వం ఈ చట్టాలను మరింత కఠినతరం చేసింది.

More Telugu News