Congress: లోక్ సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ తొలి జాబితా విడుదల... తెలంగాణలో నలుగురు అభ్యర్థుల పేర్లు ప్రకటన

The names of the Congress MP candidates are almost finalized
  • జహీరాబాద్ నుంచి సురేష్ షేట్కార్, చేవెళ్ల నుంచి సునీతా మహేందర్ రెడ్డి...
  • నల్గొండ నుంచి కుందూరు రఘువీర్ రెడ్డి, మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్ పేర్లు ఖరారు
  • వయనాడ్ నుంచి రాహుల్ గాంధీ పోటీ
రానున్న లోక్ సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ 36 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది. తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలకు గాను నలుగురి పేర్లను ప్రకటించింది. జహీరాబాద్ నుంచి సురేష్ షేట్కార్, చేవెళ్ల నుంచి సునీతా మహేందర్ రెడ్డి, నల్గొండ నుంచి కుందూరు రఘువీర్ రెడ్డి (జానారెడ్డి తనయుడు), మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్ పేర్లను ఖరారు చేసింది.

ఛత్తీస్‌గఢ్ నుంచి 6, కర్ణాటక నుంచి 6, కేరళ నుంచి 15, మేఘాలయ నుంచి రెండు, నాగాలాండ్ నుంచి ఒకటి, సిక్కిం నుంచి ఒకటి, తెలంగాణ నుంచి నాలుగు, త్రిపుర నుంచి ఒక స్థానంలో అభ్యర్థులను ప్రకటించింది. కేరళలోని వయనాడ్ నుంచి మరోసారి రాహుల్ గాంధీ బరిలోకి దిగుతున్నారు. కర్ణాటకలోని శివమొగ్గ నుంచి గీతా శివరాజ్ కుమార్‌కు టిక్కెట్ ఇచ్చింది. గురువారం ఏఐసీసీ కార్యాలయంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు సోనియా గాంధీ, కేసీ వేణుగోపాల్‌ నేతృత్వంలో పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమైంది. తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, తెలంగాణ ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు.
Congress
Lok Sabha Polls

More Telugu News