Nigeria: నైజీరియాలో సాయుధ ముఠాల దుశ్చర్య... 280 మంది చిన్నారుల అపహరణ

Armed men kidnapped school children in Nigeria
  • చికున్ జిల్లాలపై సాయుధ దుండగుల దాడులు
  • పెద్ద ఎత్తున బాలల కిడ్నాప్
  • రంగంలోకి దిగిన ప్రభుత్వ బలగాలు
నైజీరియాలో సాయుధ ముఠాలు  పాఠశాలలపై దాడులు చేసి 280 మంది చిన్నారులను అపహరించాయి. కడునా రాష్ట్రంలోని చికున్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఇక్కడ పాఠశాలలపై దాడులు చేసి విద్యార్థులను కిడ్నాప్ చేయడం తరచుగా జరుగుతుంటుంది. అటవీ ప్రాంతాల్లో స్థావరాలు ఏర్పాటు చేసుకునే సంచార జాతులకు చెందిన వారు సాయుధ ముఠాలుగా ఏర్పడి డబ్బు కోసం ఇలా దాడులకు, కిడ్నాప్ లకు పాల్పడుతుంటారు. 

ఈ ఉదయం చికున్ జిల్లాలోని కురిగా స్కూల్ పై భారీ సంఖ్యలో సాయుధులు దాడికి దిగారు. ఓ టీచర్ ను, మరో 187 మంది విద్యార్థులను కిడ్నాప్ చేశారు. మరో పాఠశాలపై దాడి చేసి పెద్ద సంఖ్యలో చిన్నారులను అహపరించారు. అపహరణకు గురైన బాలలు 8 నుంచి 15 ఏళ్ల లోపు వయసున్న వారు. కిడ్నాప్ కు గురైన వారిలో పలువురు చిన్నారులు తప్పించుకున్నారు. 

కాగా, సాయుధ ముఠాల దుశ్చర్యపై నైజీరియా ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. చిన్నారులను విడిపించేందుకు ప్రభుత్వ బలగాలు రంగంలోకి దిగాయి.
Nigeria
Children
Kidnap

More Telugu News