మహా శివరాత్రి సందర్భంగా విష్ణు మంచు ‘కన్నప్ప’ ఫస్ట్ లుక్ విడుదల

  • మంచు విష్ణు ప్రధాన పాత్రలో కన్నప్ప చిత్రం
  • ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం
  • ఆరు భాషల్లో ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల
మంచు విష్ణు ప్రధాన పాత్రలో రూపుదిద్దుకుంటున్న చిత్రం కన్నప్ప. ఇవాళ మహాశివరాత్రి పర్వదినాన 'కన్నప్ప' ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఫస్ట్ లుక్ పోస్టర్లను ఆవిష్కరించారు. కన్నప్పగా విల్లు ఎక్కుపెట్టిన మంచు విష్ణును ఈ పోస్టర్ లో చూడొచ్చు. 

మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ మూవీకి ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో మోహన్ లాల్, ప్రభాస్, శరత్‌కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం న్యూజిలాండ్ లో కన్నప్ప చిత్రం రెండో షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. తొలి షెడ్యూల్ కూడా న్యూజిలాండ్ లోనే చిత్రీకరణ జరుపుకున్న సంగతి తెలిసిందే.


More Telugu News

Kannappa Manchu Vishnu First Look Mohan Babu Tollywood