Ravichandran Ashwin: అంతర్జాతీయ క్రికెటర్‌ను పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుందో చెప్పిన స్పిన్ దిగ్గజం అశ్విన్ భార్య ప్రీతి

  • అశ్విన్ తనను వైవాహిక జీవితానికి సంసిద్ధం చేయలేదన్న ప్రీతి
  • పెళ్లి జరిగిన మరుసటి రోజే వెస్టిండీస్‌తో టెస్ట్ మ్యాచ్ కోసం కోల్‌కతా వెళ్లామని గుర్తుచేసుకున్న అశ్విన్ భార్య
  • అశ్విన్ 100వ టెస్ట్ మ్యాచ్ సందర్భంగా ఎమోషనల్ పోస్ట్ చేసిన ప్రీతి
He Did not Prepare me For Married Life says Ashwin Wife Prithi

టీమిండియా దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ధర్మశాల వేదికగా తన కెరియర్‌లో 100వ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడు. క్రికెట్ కెరియర్‌‌లో కీలకమైన ఈ మైలురాయి సందర్భంగా మ్యాచ్ ఆరంభానికి ముందు అశ్విన్ భార్య ప్రీతి సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర పోస్ట్ పెట్టారు. ఒక అంతర్జాతీయ క్రికెటర్‌ను పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుందో ఆమె చెప్పారు.

‘‘ పెళ్లికి ముందు మేము డేటింగ్ లేయలేదు. అశ్విన్ నన్ను వైవాహిక జీవితానికి సంసిద్ధం చేయలేదు. మా పెళ్లి జరిగిన మరుసటి రోజే వెస్టిండీస్‌తో టెస్ట్ మ్యాచ్ కోసం కోల్‌కతా వెళ్లాము. మా పెళ్లిపై మీడియా ఫోకస్ ఎక్కువగా ఉంటుందనే విషయం నాకు అంతగా తెలియదు. పెళ్లిలో అశ్విన్ తాళి కడుతున్నప్పుడు నాకు గుర్తుకు ఉంది. మా ఇద్దరి చుట్టూ ఉన్న మీడియా ఫోటోగ్రాఫర్‌ల మధ్య మేము డబ్బు చెల్లించి నియమించుకున్న కెమెరామెన్ కనిపించలేదు. క్రికెటర్ చుట్టూ వాతావరణం ఎలా ఉంటుందో తొలిసారి అప్పుడే గమనించాను’’ అని ప్రీతి అన్నారు. ఈ మేరకు ఆమె ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’కు రాసిన కాలమ్‌లో పేర్కొన్నారు.

‘‘ అశ్విన్‌ భార్యగా క్రికెట్‌ను ఎంత వరకు ఇష్టపడతానో నాకు తెలియదు. కానీ అతడిని (అశ్విన్) ప్రేమిస్తున్నానని నాకు తెలుసు. కానీ అతడి వృత్తి నాకు నచ్చకపోతే ఈ రోజు ఈ విధంగా ఉండేదానినా?. అశ్విన్‌కు ప్రాధాన్యత ఇవ్వడంలో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. తొలినాళ్లలో కుదురుకోలేకపోయాను. పెళ్లి విషయంలో కాదు. అశ్విన్‌తో నేను నిర్మించుకున్న బంధాన్ని ఈ క్రికెట్ ఎంత దూరం చేస్తుందోనని ఆందోళన చెందాను. మొదట ఆశ్చర్యం.. అనంతరం షాకింగ్‌గా అనిపించింది. ఆ తర్వాత అత్యాశ అనిపించింది. 

ఇక మాకు పిల్లలు పుట్టాక సమయాన్ని త్యాగం చేస్తున్నాను. అశ్విన్ అత్యున్నత స్థాయిలో విజయం సాధించాలంటే అతడు తల్లిదండ్రులకు, పిల్లలు లేదా భార్యకు దూరంగా గడపాలని తెలుసుకోవడానికి సమయం పట్టింది. సక్సెస్ అవ్వాలని సమయాన్ని వెచ్చించాలని తెలుసుకున్నాను’’ అని ప్రీతి వివరించారు. అశ్విన్‌కు ఏడేళ్ల వయసు ఉన్నప్పుడు క్రికెట్ అతడి జీవితంలోకి వచ్చిందని ప్రీతి పేర్కొన్నారు. కొన్నిసార్లు క్రికెట్ తప్ప అతడికి ఇంకేమీ తెలియదని తాను గ్రహించానని పేర్కొన్నారు. కరోనా మహమ్మారి నిజంగా తమను ఒకచోట చేర్చిందని, ఒక విధంగా ఒక ఆశీర్వాదంలా అనిపించిందని చెప్పారు.

More Telugu News