koneru konappa: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌తో కలిసి పని చేయలేను: మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప

Koneru Konappa says he is not ready to work with RS Praveen Kumar
  • ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనను పార్టీలోకి ఆహ్వానించారన్న కోనేరు కోనప్ప
  • నియోజకవర్గ అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రిని కలిసినట్లు వెల్లడి
  • బీఆర్ఎస్, బీఎస్పీ కలయిక తనకు ఇష్టం లేదని వెల్లడి
ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో తాను బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌తో కలిసి పని చేయలేనని... ఇదే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనను పార్టీలోకి ఆహ్వానించారని సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. తాను నియోజకవర్గ అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశానన్నారు. బీఆర్ఎస్, బీఎస్పీ కలయిక తనకు ఏ మాత్రం ఇష్టం లేదన్నారు. తాను నియోజకవర్గం నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నానని... త్వరలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు. కోనేరు కోనప్ప నిన్న ముఖ్యమంత్రిని కలవడం చర్చనీయాంశంగా మారింది.
koneru konappa
BRS
Congress
Revanth Reddy

More Telugu News