Lambasingi: మార్చి 15న థియేటర్లలోకి వస్తున్న 'లంబసింగి'

  • భరత్ రాజ్, దివి జంటగా 'లంబసింగి.. ఏ ప్యూర్ లవ్ స్టోరీ'
  • నవీన్ గాంధీ దర్శకత్వం
  • పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి
  • తాజాగా ఈ చిత్రం నుంచి రెండో పాట విడుదల 
Lambasingi movie set to release on March 15

భరత్ రాజ్, 'బిగ్ బాస్' ఫేమ్ దివి జంటగా నవీన్ గాంధీ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం 'లంబసింగి'. 'ఏ ప్యూర్ లవ్ స్టోరీ' అనేది ఈ చిత్రానికి క్యాప్షన్. దర్శకుడు కల్యాణ్ కృష్ణ సమర్పణలో కాన్సెప్ట్ ఫిలింస్ బ్యానర్ పై ఆనంద్.టి ఈ చిత్రాన్ని నిర్మించారు. 

పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న లంబసింగి చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రం మార్చి 15న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాతో భరత్ రాజ్ కథానాయకుడిగా పరిచయం అవుతున్నాడు. 

ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా మొదటిపాట "నచ్చేసిందే నచ్చేసిందే…"  ప్రేక్షకుల నుండి మంచి స్పందన అందుకుంది. తాజాగా ఈ సినిమా నుండి 'వయ్యారి గోదారి' సాంగ్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. సంగీత దర్శకుడు ఆర్ఆర్ ధ్రువన్ బాణీలకు కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు. జావెద్ అలీ ఆలపించారు. 

ఈ చిత్రంలో వంశీ రాజ్, కిట్టయ్య, నిఖిల్ రాజ్, జనార్దన్, అనురాధ, మాధవి, నవీన్ రాజ్, ప్రమోద్, రమణ, పరమేష్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు.

More Telugu News