ration card: రేషన్ కార్డు అంటే అడ్రస్ ప్రూఫ్ కాదు: ఢిల్లీ హైకోర్టు స్పష్టీకరణ

  • రేషన్ కార్డును అడ్రస్ లేదా నివాసానికి సంబంధించిన రుజువుగా పరిగణించలేమని వెల్లడి
  • ప్రజాపంపిణీ వ్యవస్థ కింద నిత్యావసర వస్తువులను పొందడానికి ప్రత్యేకంగా రేషన్ కార్డు జారీ చేస్తారన్న హైకోర్టు
  • ఢిల్లీలోని ఓ పునరావాస పథకం కేసులో ఢిల్లీ హైకోర్టు స్పష్టీకరణ

రేషన్ కార్డు అంటే అడ్రస్ ప్రూఫ్ కాదని... ప్రజాపంపిణీ కోసమేనని ఢిల్లీ హైకోర్టు గురువారం స్పష్టం చేసింది. రేషన్ కార్డును అడ్రస్ లేదా నివాసానికి సంబంధించిన రుజువుగా పరిగణించలేమని వెల్లడించింది. ప్రజాపంపిణీ వ్యవస్థ కింద నిత్యావసర వస్తువులను పొందడానికి ప్రత్యేకంగా రేషన్ కార్డు జారీ చేస్తారన్నారు. కాబట్టి దీనిని ప్రూఫ్‌గా చూడలేమని తెలిపింది.

ఢిల్లీలోని కాత్పుత్లీ కాలనీని అభివృద్ధి చేసిన తర్వాత పునరావాస పథకం కింద ప్రత్యామ్నాయ వసతి కల్పించాలని కోరుతూ అక్కడి వారు దాఖలు చేసిన పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి చంద్రధారి సింగ్ విచారణ జరిపారు. ఈ పథకం కింద ప్రయోజనం పొందేందుకు తప్పనిసరి ధ్రువీకరణపత్రంగా రేషన్ కార్డు ఉండాలని అధికార నోటీసులో పేర్కొన్నారు. దీనిని హైకోర్టు తప్పుబట్టింది. ఈ నిర్ణయం ఏకపక్షం, చట్టవిరుద్ధమని పేర్కొన్నారు.

More Telugu News