అల్లుడి భవనాల కూల్చివేత... రేవంత్ రెడ్డి సలహాదారును కలిసిన మాజీ మంత్రి మల్లారెడ్డి

Malla Reddy meets Vem Narender Reddy
  • దుండిగల్‌లోని మర్రి రాజశేఖరరెడ్డి కాలేజీకి చెందిన భవనాలను కూల్చివేసిన అధికారులు
  • అల్లుడు రాజశేఖరరెడ్డితో కలిసి వేం నరేందర్ రెడ్డిని కలిసిన మల్లారెడ్డి
  • భవనాల కూల్చివేత నేపథ్యంలో కలవడంతో ప్రాధాన్యత
మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి గురువారం ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డిని కలిశారు. తన అల్లుడు, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డితో కలిసి సీఎం సలహాదారు వద్దకు వెళ్లారు. దుండిగల్‌లోని దామరచెరువు ఎఫ్‌టీఎల్ బఫర్ జోన్‌లోని మర్రి రాజశేఖర రెడ్డి కాలేజీకి చెందిన రెండు శాశ్వత భవనాలను, ఆరు తాత్కాలిక షెడ్లను అధికారులు కూల్చివేసిన విషయం తెలిసిందే. 8.24 ఎకరాల చెరువును ఆక్రమించి పార్కింగ్ కోసం రోడ్లు, భవనాలు నిర్మించినట్లు అధికారులు గుర్తించారు. ఈ మేరకు వారం క్రితం యాజమాన్యానికి నోటీసులు ఇచ్చారు. తాజాగా మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కూల్చివేతలు చేపట్టారు. ఈ క్రమంలో మల్లారెడ్డి... సీఎం సలహాదారును కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Go Back to Shorts
Ch Malla Reddy
Revanth Reddy
vem narender reddy

More Telugu News