Kotamreddy Sridhar Reddy: పోలీసులు కసిగా ఉన్నారంటూ ఆసక్తికర కథ చెప్పిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

  • గతంలో ఫోన్ చేస్తే వాట్సాప్ కాల్ చేయమని పోలీసు అధికారులు చెప్పేవారన్న కోటంరెడ్డి
  • ఇప్పుడు మామూలు ఫోన్లతోనే కాల్స్ చేస్తున్నారని వెల్లడి
  • నాలుగు రోజుల్లో మన ప్రభుత్వం వస్తుందని చెపుతున్నారన్న కోటంరెడ్డి
Kotamreddy Sridhar Reddy tells a story

వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమి ఘన విజయం సాధించబోతోందని టీడీపీ నేత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పోలీసు అధికారుల్లో కూడా మార్పు వచ్చిందని చెప్పారు. ఈ సందర్భంగా పోలీసు అధికారుల ప్రస్తుత పరిస్థితిని తెలియజేస్తూ ఆయన ఒక కథ చెప్పారు. 

"శ్యామలమ్మ అని ఒక గయ్యాళి అత్త ఉండేది. ఆమెకు విమలమ్మ అనే ఒక కోడలు ఉండేది. ఆమె చాలా సాఫ్ట్. ఒక రోజు విమలమ్మ గందరగోళం చేస్తోంది. పనివాళ్లను పిలిచి ఆ వస్తువు ఇక్కడ పెట్టు, ఇది అక్కడ పెట్టు అని వాళ్లను దబాయిస్తోంది. అప్పుడు పక్కింటి రాములమ్మ అడిగిందంట. విమలమ్మా... విమలమ్మా... ఏంది బాగా రెచ్చిపోతున్నావు... మీ అత్తలా ప్రవర్తిస్తున్నావని అడిగింది. దీంతో, ఇది ఎంత సేపులే... మా అత్త మార్కెట్ కు పోయింది... ఆమె వచ్చేంత వరకే అని చెప్పింది. ఇంతలోనే అత్త శ్యామలమ్మ వచ్చేసింది. విమలమ్మ ఎప్పటి మాదిరిగానే చేతులు కట్టుకుని అత్తా, అత్తా అంటూ భయాన్ని వ్యక్తం చేసింది. 

ఇంతకు ముందు పోలీసు అధికారులకు మేము ఫోన్లు చేస్తుంటే... వాట్సప్ కాల్స్ చేయండి సార్ అనేవాళ్లు. లేదా వేరే ఫోన్ల నుంచి వాళ్లు కాల్స్ చేసేవాళ్లు. ఇప్పుడు మామూలు ఫోన్ నుంచే ఫోన్లు చేస్తున్నారు. ఏందయ్యా ఇది అని అడిగితే... ఇంకెన్ని రోజులు సార్, నాలుగు రోజుల్లో మన ప్రభుత్వం వచ్చేస్తుందని వాళ్లు చెపుతున్నారు. మాతో చాలా దుర్మార్గాలు చేయించారు సార్... ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వాటినన్నింటికీ సరిదిద్దుకుంటాం సార్ అని పోలీసు అధికారులు మాతో చెప్పారు. మరో నాలుగైదు రోజులు మాత్రమే... ఆ తర్వాత వైసీపీ పని అయిపోయిట్టే. పోలీసులు కూడా బాగా కసిగా ఉన్నారు" అని కోటంరెడ్డి చెప్పారు.

More Telugu News