K Kavitha: ఏముందని ఈ కేసును టీవీ సీరియల్ మాదిరి సాగదీస్తున్నారు?: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత

  • లిక్కర్ కేసులో తాను కూడా బాధితురాలినేనని అన్న కవిత
  • రాజకీయాల్లో విలువలకు చోటు లేకుండా పోయిందని విమర్శ
  • ఆదర్శ్ కుంభకోణంలో ఉన్న చవాన్ కు రాజ్యసభ సీటు ఇచ్చారని మండిపాటు
Kavitha comments on Delhi liquor case

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో విచారణపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విమర్శలు గుప్పించారు. ఈ కేసులో ఏముందని టీవీ సీరియల్ మాదిరి సాగదీస్తున్నారని ఆమె ప్రశ్నించారు. ఇది పెద్ద కేసు కాదని... దాని సంగతి తమ లీగల్ టీమ్ చూసుకుంటుందని చెప్పారు. ఢిల్లీ లిక్కర్ కేసులో తాను కూడా బాధితురాలినేనని చెప్పారు. ప్రస్తుత రాజకీయాల్లో సిద్ధాంతాలకు, విలువలకు చోటు లేకుండా పోయిందని విమర్శించారు. రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడితే ఎదుర్కొంటానని చెప్పారు. ఆదర్శ్ కుంభకోణంలో ప్రమేయం ఉన్న చవాన్ కు రాజ్యసభ సీటును బీజేపీ ఇచ్చిందని దుయ్యబట్టారు. ఆయనను సీఎం అభ్యర్థిగా ప్రకటించినా ఆశ్చర్యం లేదని అన్నారు. 

అనుభవరాహిత్యం, అవగాహన లోపంతో రేవంత్ పాలన కొనసాగుతోందని కవిత విమర్శించారు. సీతక్కకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చారని, వెంటనే ఆమెను డిప్యూటీ సీఎం చేయాలని డిమాండ్ చేశారు. మహిళలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందని అన్నారు. జీవో 3తో ఉద్యోగాల్లో ఆడబిడ్డలకు అన్యాయం జరుగుతోందని చెప్పారు. మహిళకు జరుగుతున్న అన్యాయంపై ఉమెన్స్ డే రోజున ఇందిరాపార్క్ ధర్నా చౌక్ లో నిరసన తెలిపేందుకు అనుమతిని ఇవ్వడం లేదని మండిపడ్డారు. అనుమతి ఇచ్చినా, ఇవ్వకపోయినా తమ పోరాటం ఆగదని తెలిపారు.

More Telugu News