Sharanya Pradeep: మాది నిజమాబాద్ .. మా ఫ్యామిలీ పరిస్థితి ఇది: నటి శరణ్య ప్రదీప్

  • తన తండ్రి ప్రైవేట్ ఉద్యోగి అని చెప్పిన శరణ్య ప్రదీప్ 
  • తల్లి కుట్టుమిషన్ పని చేస్తుందని వెల్లడి 
  • ఆమె దాచిన డబ్బుతో బట్టలు కొనేదని వివరణ 
  • తన భర్త ప్రోత్సాహమే కారణమని వ్యాఖ్య

Sharanya Pradeep Interview

శరణ్య ప్రదీప్ .. ఇప్పుడు ఈ పేరును గురించి పెద్దగా పరిచయం చేవలసిన అవసరం లేదు. ఎందుకంటే 'ఫిదా' దగ్గర నుంచి 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండు' వరకూ ఆమె పోషించిన పాత్రలు ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యాయి. సహజమైన ఆమె నటన .. డైలాగ్ డెలివరీ అభిమానుల సంఖ్యను పెంచుతూ వెళుతోంది. తాజా ఇంటర్వ్యూలో ఆమె తన గురించిన అనేక విషయాలను ప్రస్తావించింది. 

" మాది నిజామాబాద్ .. మా నాన్న ఒక ప్రైవేట్ ఉద్యోగి .. అమ్మ హౌస్ వైఫ్ .. నేను బీఎస్సీ చేశాను .. నాకు ఒక చెల్లెలు ఉంది. మా అమ్మ కుట్టు మిషన్ పని చేస్తూ ఉండేది. నాన్న సంపాదన అలా సరిపోయేది. అంటే ఉన్నంతలో సర్దుకుపోయే వాళ్లం. ఏదైనా కొనుక్కోవాలంటే చాలా ముందు నుంచి డబ్బులు దాచుకోవలసిందే. అమ్మ తాను దాచుకున్న డబ్బులతో మాకు బట్టలు కొనేది.  ఈలోగా కజిన్స్ బట్టలు .. బ్యాగులు వాడుకునే వాళ్లం" అని అంది. 

''మొదటి నుంచి కూడా సినిమాలంటే చాలా ఇష్టం. సినిమాలను చూసి వచ్చిన తరువాత ఆర్టిస్టులను అనుకరిస్తూ ఉండేదానిని. మా ఊళ్లోనే లోకల్ ఛానల్ లో పనిచేసే అవకాశం వచ్చింది. ఆ తరువాత హైదరాబాద్ లో V6 ఛానల్ లో చేసే అవకాశం వచ్చింది. అక్కడే మా వారు పరిచయం కావడం జరిగింది. ఆయన ప్రోత్సాహంతోనే 'ఫిదా' ఆడిషన్స్ కి వెళ్లాను. అందువల్లనే ఈ రోజున ఇక్కడ ఉన్నాను" అని చెప్పింది.

More Telugu News