Chandrababu Naidu: చంద్ర‌బాబు ఢిల్లీ ప‌ర్య‌ట‌న ఖ‌రారు

TDP President Nara Chandrababu Naidu went to Delhi on Thursday
  • గురువారం ఢిల్లీ వెళ్తున్న చంద్ర‌బాబు
  • ఈ ప‌ర్య‌ట‌న‌లో బీజేపీతో పొత్తులో భాగంగా కీల‌క మంత‌నాలు
  • ఇప్ప‌టికే ఢిల్లీ చేరిన ఏపీ బీజేపీ నేత‌లు
టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌లపై క‌స‌ర‌త్తు ముమ్మ‌రం చేశారు. దీనిలో భాగంగా తాజాగా బాబు ఢిల్లీ ప‌ర్యట‌న ఖ‌రారైంది. చంద్ర‌బాబు గురువారం ఢిల్లీ వెళ్ల‌నున్నారు. బీజేపీతో సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌లో పొత్తు విష‌య‌మై ఢిల్లీలో కీల‌క చ‌ర్చ‌లు జ‌రప‌నున్నారు. ఇక బుధ‌వారం ఉద‌యం జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో చంద్రబాబు భేటీ అయిన విష‌యం తెలిసిందే. సుమారు గంట‌న్న‌ర పాటు ఈ స‌మావేశం జ‌రిగింది. ఇందులో ఢిల్లీ అంశాల‌తో పాటు రెండో ఉమ్మ‌డి జాబితాలోని అభ్య‌ర్థుల విష‌యమై కూడా ఇరువురు అధినేత‌లు కీల‌క మంత‌నాలు జ‌రిపారు. మ‌రోవైపు బుధ‌వారం ఉద‌య‌మే ఏపీ బీజేపీ అధ్య‌క్షురాలు పురందేశ్వ‌రి, సోము వీర్రాజు ఢిల్లీ బ‌య‌ల్దేరి వెళ్లిన విష‌యం తెలిసిందే.
Chandrababu Naidu
TDP
Delhi
Andhra Pradesh
AP Politics

More Telugu News