Hyderabad: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో హైదరాబాద్ వాసి మృతి

  • రష్యా తరఫున పోరాడుతూ ప్రాణాలు కోల్పోయిన హైదరాబాద్‌కు చెందిన 30 ఏళ్ల మహ్మద్ అఫ్సాన్ 
  • అఫ్సాన్ మృతి చెందినట్లు ధ్రువీకరించిన అధికారులు
  • రష్యాలోని భారతీయులను తీసుకువస్తామని ప్రకటించిన కొన్ని రోజులకే విషాదం

రష్యా - ఉక్రెయిన్ పోరులో హైదరాబాద్ వాసి మృతి చెందాడు. ఈ రెండు దేశాల మధ్య రెండేళ్లుగా యుద్ధం కొనసాగుతోంది. ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో రష్యా తరఫున పోరాడుతూ హైదరాబాద్‌కు చెందిన 30 ఏళ్ల మహ్మద్ అఫ్సాన్ ప్రాణాలు కోల్పోయాడు. అఫ్సాన్ మృతి చెందినట్లు అధికారులు బుధవారం ధ్రువీకరించారు. ఉద్యోగం విషయంలో మోసపోయి అతను రష్యన్ ఆర్మీలో బలవంతంగా చేరాల్సి వచ్చినట్లుగా తెలుస్తోంది.

రష్యా సైన్యానికి సహాయక సిబ్బందిగా పని చేస్తోన్న దాదాపు ఇరవై మంది భారతీయులను తీసుకు వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపిన కొన్ని రోజులకే ఈ విషాదం చోటు చేసుకుంది. అఫ్సాన్‌ను హైదరాబాద్ తీసుకు వచ్చేందుకు సాయం కోసం కుటుంబ సభ్యులు మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీని కలిశారు. దీంతో మజ్లిస్ పార్టీ... మాస్కోలోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించింది. ఈ క్రమంలో అఫ్సాన్ మృతి చెందినట్లు అక్కడి అధికారులు ధ్రువీకరించారు.

More Telugu News