Bramayugam: సోనీలివ్ ఫ్లాట్ ఫామ్ పైకి 'భ్రమయుగం'

  • ఫిబ్రవరి 15న మలయాళంలో విడుదలైన 'భ్రమయుగం'
  • చాలా వేగంగా 50 కోట్లను రాబట్టిన సినిమా 
  • పబ్లిసిటీ లేని కారణంగా తెలుగులో కరవైన రెస్పాన్స్
  • ఈ నెల 15వ తేదీ నుంచి జరగనున్న స్ట్రీమింగ్  
Bramayugam Movie Update

మలయాళంలో ఈ ఏడాది ప్రారంభంలో ఎక్కువ మంది ఎక్కువ రోజుల పాటు మాట్లాడుకున్న సినిమా 'భ్రమయుగం'. మమ్ముట్టి ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమాకి రాహుల్ సదాశివన్ దర్శకత్వం వహించాడు. ఫిబ్రవరి 15వ తేదీన ఈ సినిమా అక్కడ విడుదలైంది. 'భ్రమయుగం .. ఇది కలియుగానికి వికృత రూపం' అంటూ మమ్ముట్టి  అందరిలో ఉత్కంఠను రేకెత్తించారు. 

సాధారణంగా సీనియర్ స్టార్ హీరోలు హారర్ థ్రిల్లర్ సినిమాలు చేయరు. అందునా ఆ హారర్ తమ పాత్ర వైపు నుంచి ఉండటానికి పెద్దగా ఆసక్తిని చూపించరు. అయినా మమ్ముట్టి ఈ సినిమాను అంగీకరించడమే అందరిలో కుతూహలం పెరగడానికి ప్రధానమైన కారణమైంది. ఈ ఆసక్తినే చాలా వేగంగా ఈ సినిమాను 50 కోట్ల క్లబ్ లోకి చేర్చింది. చాలా తక్కువ బడ్జెట్ లో చేసిన గొప్ప ప్రయోగంగా నిలిచింది. 

అలాంటి ఈ సినిమా ఇప్పుడు ఓటీటీకి రావడానికి రెడీ అవుతోంది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను సోనీ లివ్ వారు తీసుకున్నారు. ఈ నెల 15వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. మలయాళంతో పాటు మిగతా భాషల్లోను ఈ సినిమా ప్రేక్షకులను పలకరించనుంది. తెలుగు వెర్షన్ కి సంబంధించి పెద్దగా పబ్లిసిటీ లేకపోవడం వలన, ఈ సినిమాను చాలామంది థియేటర్స్ లో చూడలేకపోయారు. ఓటీటీ వైపు నుంచి ఈ సినిమా మంచి రెస్పాన్స్ ను రాబట్టే అవకాశాలు ఉన్నాయి.

More Telugu News