Revanth Reddy: 'రైతు నేస్తం' కార్యక్రమాన్ని ప్రారంభించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

  • మల్లు భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ప్రారంభించిన సీఎం
  • 110 రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభం
  • మూడేళ్లలో 2601 రైతు వేదికల్లో అందుబాటులోకి వీడియో కాన్ఫరెన్స్ యూనిట్లు
Revanth Reddy launches Rythu Nestham

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం రాష్ట్రవ్యాప్తంగా 'రైతు నేస్తం' కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 110 రైతు వేదికల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 

రైతు వేదికలకు వీడియో కాన్ఫరెన్స్ అనుసంధానం ద్వారా రైతుల సమస్యలను పరిష్కరించే వినూత్న కార్యక్రమం 'రైతు నేస్తం'. దశలవారీగా మూడేళ్లలో 2601 రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ యూనిట్లను అందుబాటులోకి తీసుకువస్తారు. రూ.97 కోట్లతో ఈ ప్రాజెక్టును అమలు చేయ‌నున్నారు. మొదటి దశలో రూ.4.07 కోట్లతో 110 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏర్పాటు చేస్తారు. ఇందుకు సంబంధించి నిధులను ప్రభుత్వం విడుదల చేసింది.

More Telugu News