Ravichandran Ashwin: స్పిన్ బౌలింగ్ లో 'ఇంజనీర్'.. అశ్విన్ పై ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్ ప్రశంసలు

  • అతనో బ్రిలియంట్ బౌలర్ అంటూ మెచ్చుకున్న పనెసర్
  • 2012లో అశ్విన్ ఆటను మొదటిసారి చూసినట్లు వెల్లడి 
  • వందో టెస్టు ఆడబోతున్న టీమిండియా స్పిన్నర్
Montey Panesar Humongous Praise For Ravichandran Ashwin

టీం ఇండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పై ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనెసర్ ప్రశంసల జల్లు కురిపించాడు. స్పిన్ బౌలింగ్ లో అశ్విన్ ఇంజనీర్ అంటూ మెచ్చుకున్నాడు. బంతి యాంగిల్ ను మార్చుతూ, విభిన్న బంతులు వేస్తూ బ్యాట్స్ మెన్ ను బోల్తా కొట్టిస్తాడంటూ కొనియాడాడు. తొలిసారి 2012లో అశ్విన్ ఆటను చూశానని, బౌలింగ్ విధానం చూసి గొప్ప బౌలర్ అవుతాడని అప్పుడే అనిపించిందని చెప్పాడు. ఈమేరకు ఓ మీడియా సంస్థకు ఇచ్చిన టెలిఫోన్ ఇంటర్వ్యూలో పనెసర్ ఈ వ్యాఖ్యలు చేశాడు.

ఇంగ్లాండ్ జట్టులో లెగ్ స్పిన్నర్ గా చాలా కాలం రాణించిన పనెసర్.. 2016 లో అన్ని క్రికెట్ ఫార్మాట్లకు కు గుడ్ బై చెప్పాడు. ప్రస్తుతం ఫ్రీలాన్స్ స్పోర్ట్స్ జర్నలిస్టుగా వ్యవహరిస్తున్న పనెసర్.. 100వ టెస్ట్ మ్యాచ్ ఆడనున్న రవిచంద్రన్ అశ్విన్ ను 'స్పిన్ బౌలింగ్ లో ఇంజనీర్' అంటూ ప్రశంసించాడు. అశ్విన్ బ్రిలియంట్ స్పిన్నర్ అని మెచ్చుకున్నారు.

గురువారం నుంచి ధర్మశాల వేదికగా ఇంగ్లాండ్ తో ఐదో టెస్ట్ మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ రవిచంద్రన్ అశ్విన్ కు వందో టెస్ట్ మ్యాచ్.. ఇప్పటి వరకు ఆడిన 99 టెస్టుల్లో సగటున 23.9 తో అశ్విన్ 507 వికెట్లు తీశాడు. టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. టీమిండియా రెండో ఆటగాడిగా రికార్డ్ సృష్టించాడు. 

More Telugu News