Jr NTR: ‘వార్-2’లో రహస్య గూఢచారిగా ఎన్టీఆర్?

  • సీక్రెట్ ఏజెంట్‌ పాత్రలో కనిపించబోతున్నాడని సినీ వర్గాల్లో టాక్
  • ఈ పాత్ర పాజిటివ్‌గా ఉంటుందని సమాచారం
  • త్వరలోనే సినిమా షూటింగ్‌లో పాల్గొననున్న జూనియర్ ఎన్టీఆర్
Reports saying that Jr NTR to act as a secret spy in War 2

‘యంగ్ టైగర్’ ఎన్టీఆర్ సరికొత్త పాత్ర పోషించబోతున్నాడా? బాలీవుడ్ సినిమా ‘వార్-2’లో సీక్రెట్ ఏజెంట్ పాత్రలో అలరించనున్నాడా?.. అంటే ఔననే అంటున్నాయి సినీ వర్గాలు. రహస్య గూఢచారిగా నటించబోతున్నాడని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. భారత్‌కు చెందిన సీక్రెట్ ఏజెంట్‌గా ఈ పాత్ర పాజిటివ్‌గా ఉంటుందని తెలుస్తోంది. కాగా వార్-2 మూవీలో ఎన్టీఆర్ నటించబోతున్నాడని నిర్ధారణ అయినప్పటికీ క్యారెక్టర్‌పై సస్పెన్స్ వీడలేదు. ఈ సమయంలో ఈ వార్త సినీ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. కాగా త్వరలో ఎన్టీఆర్‌ ఈ సినిమాలో షూటింగ్‌లో పాల్గొనబోతున్నాడు. 

హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘వార్‌ 2’ మల్టీస్టారర్ మూవీ. అయాన్‌ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్‌ నటిస్తున్నాడు. ఈ సినిమాని ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు. ‘వార్‌ 2’ సినిమా వచ్చే ఏడాది ఆగస్టు 14న విడుదల కానుంది.

More Telugu News