BJP: బీహార్‌లో సీట్ల పంపకం కొలిక్కి: బీజేపీకి 17, నితీశ్ కుమార్ పార్టీకి 14 సీట్లు?

  • చిరాగ్ పాశ్వాన్, పశుపతి పరాస్‌లకు ఆరు సీట్లు ఇచ్చేందుకు బీజేపీ సిద్ధం
  • ఉపేంద్ర కుశ్వాహ, మాంఝీ నేతృత్వాలలోని రెండు పార్టీలకు చెరో సీటు
  • బీహార్‌లో ఎన్డీయేలో పెరిగిన మిత్రులు
BJP likely to give 14 seats to Nitish Kumars JDU

బీహార్‌లో ఎన్డీయే కూటమి మధ్య సీట్ల పంపకం కొలిక్కి వచ్చినట్లుగా కనిపిస్తోంది. మొత్తం 40 స్థానాలకు గాను బీజేపీ 17 సీట్లలో పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీయూకు 14 సీట్లు, చిరాగ్ పాశ్వాన్, పశుపతి పరాస్‌లకు ఆరు సీట్లు ఇవ్వాలని బీజేపీ భావిస్తోందని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఉపేంద్ర కుశ్వాహ, మాంఝీ పార్టీలకు ఒక్కో సీటు ఇవ్వనుంది. ఎన్డీయే భాగస్వామ్య పక్షాల మధ్య సీట్ల పంపకాలకు సంబంధించి చర్చించేందుకు బీజేపీ ఎన్నికల కమిటీ సమావేశం పాట్నాలో సమావేశమైంది.

ఈ సమావేశంలో బీజేపీ బీహార్ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి మాట్లాడుతూ... ఎన్నికల కమిటీ సమావేశం జరిగిందని, త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. తాము పదిహేడు సీట్లు తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలిపారు. 2019 లోక్ సభ ఎన్నికల సమయంలో జేడీయూ, చిరాగ్ పాశ్వాన్ మిత్రులుగా ఉన్నారు. ఇప్పుడు ఉపేంద్ర కుశ్వాహ నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ, జితిన్ రామ్ మాంఝీ నేతృత్వంలోని హిందుస్థానీ అవామీ మోర్చా, లోక్ జనశక్తి పార్టీకి చెందిన రెండు వర్గాలు ఎన్డీయే భాగస్వాములుగా ఉన్నాయి.

More Telugu News