BRS: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో డీఎస్పీ ప్రణీత్ కుమార్ సస్పెన్షన్... హెడ్ క్వార్టర్స్ విడిచి వెళ్లకూడదని ఆదేశాలు

  • బీఆర్ఎస్ హయాంలో ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాప్ చేసినట్లుగా ఆరోపణలు 
  • కేసులో బయటకు కీలక విషయాలు
  • నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు గుర్తించిన అధికారులు
TG Government suspends DSP praneeth Kumar

ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబీ డీఎస్పీగా పని చేసిన ప్రణీత్ కుమార్‌ను తెలంగాణ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. బీఆర్ఎస్ హయాంలో ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాప్ చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో కీలక విషయాలు బయటకు వచ్చాయి. దీంతో ప్రణీత్ కుమార్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాదు, ఆయనను హెడ్ క్వార్టర్స్ విడిచి వెళ్లకూడదని ఆదేశాలు జారీ చేసింది.

ప్రణీత్ కుమార్ ప్రస్తుతం సిరిసిల్ల జిల్లా క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డీఎస్పీగా ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు అధికారులు గుర్తించారు. కంప్యూటర్లలోని 42 హార్డ్ డిస్కులను మార్చినట్లు, సీసీ కెమెరాలు ఆఫ్ చేసి హార్డ్ డిస్కులు ధ్వంసం చేయించినట్లుగా గుర్తించారు.

More Telugu News