Gopichand: ఈ వారం థియేటర్ల దగ్గర పోటీ కాస్త గట్టిగానే ఉందే!

  • ఈ వారం 'భీమా'గా వస్తున్న గోపీచంద్
  • యాక్షన్ ఎంటర్టయినర్ గా రూపొందిన సినిమా  
  • అదే రోజున రిలీజ్ అవుతున్న 'గామి'
  • రంగంలోకి దిగుతున్న 'ప్రేమలు'

New Movies Update

ఈ శుక్రవారం .. మహాశివరాత్రి సందర్భాన్ని పురస్కరించుకుని, మూడు సినిమాలు థియేటర్లలో దిగుతున్నాయి. ఆ జాబితాలో 'భీమా' .. 'గామి' .. 'ప్రేమలు' సినిమాలు కనిపిస్తున్నాయి. గోపీచంద్ హీరోగా 'భీమా' సినిమా రూపొందింది. కెకె రాధామోహన్ నిర్మించిన ఈ సినిమాకి, కన్నడ దర్శకుడు హర్ష దర్శకత్వం వహించాడు. ప్రియా భవాని శంకర్ - మాళవిక శర్మ కథానాయికలుగా అలరించనున్నారు. విష్వక్సేన్ హీరోగా 'గామి' సినిమా నిర్మితమైంది. కార్తీక్ శబరీశ్ -శ్వేత నుంచి వస్తున్న ఈ సినిమాకి, విద్యాధర్ దర్శకత్వం వహించాడు. చాందిని చౌదరి కథానాయికగా నటించిన ఈ సినిమాలో, అభినయ ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనుంది. కాశీ .. హిమాలయాల నేపథ్యంలో నడిచే ఈ సినిమా, ట్రైలర్ తోనే ఆసక్తిని రేకెత్తించింది. ఇక ఈ రెండు సినిమాలతో పాటు మలయాళ సినిమా అయిన 'ప్రేమలు' తెలుగు అనువాదంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. గిరీశ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా, ఫిబ్రవరి 9వ తేదీన మలయాళంలో విడుదలై భారీ వసూళ్లతో దూసుకుపోయింది. అలాంటి ఈ సినిమా కూడా ఈ వారం బరిలో నిలబడింది. డిఫరెంట్ జోనర్స్ నుంచి వస్తున్న ఈ మూడు సినిమాలు ఎలాంటి ఫలితాలను రాబడతాయనేది చూడాలి.

More Telugu News